ఎస్టీఐలు (STIలు) చాలా మంది లైంగికంగా చురుకైన (సెక్షుఅలీ యాక్టివ్) వ్యక్తులకు వారి జీవితంలో ఒక్కసారైనా సోకె సుఖవ్యాధులు. కొన్నిసార్లు మీరు లేదా మీ లైంగిక శృంగార సహచరులు (పార్టనర్/పార్ట్నర్లు) ఎటువంటి లక్షణాలను చూపించకుండా ఎస్టీఐ (STI) కలిగి ఉండవచ్చు. మీకనిపించేదాన్ని బట్టి మీకు ఎస్టీఐ (STI) ఉందో లేదో మీరు ఎల్లప్పుడూ చెప్పలేరు. అయినప్పటికీ, మీ జననేంద్రియాలపై పుండ్లు లేదా గడ్డలు, అసాధారణ ఉత్సర్గ (డిశ్చార్జ్), దురద మరియు మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి వంటి ఏవైనా ఎస్టీఐ (STI) లక్షణాలను మీరు గమనించినట్లయితే, మీరు మిమల్ని పరీక్షించుకోవాలి.
మీకు ఎస్టీఐ (STI) ఉందా లేదా అని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా రేగులర్గా పరీక్షించడం ప్రభావవంతమైన మార్గం. పరీక్ష భయాందోళనలను కలిగించవచ్చు. ఎస్టీఐకి (STIకి) చికిత్స పొందకపోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది మరియు మీరు మీ లైంగిక శృంగార సహచరులకు (పార్ట్నర్కి/పార్ట్నర్లకు) సుఖవ్యాధులను/ఇన్ఫెక్షన్లను ప్రసారించవచ్చు.
ఎస్టీఐలు (STIలు) సాధారణమైనప్పటికీ, కొన్నిసార్లు ఒకరు పాజిటివ్‌గా పరీక్షించబడడం వల్ల వారు భావోద్వేగానికి భయాదోళనలకు లోనవ్వగలరు. ఎన్నో ఎస్టీఐలను (STIలను) సుమారు ఒకటి లేదా రెండు వారాలలో మందులతో చికిత్స మరియు నయం చేయవచ్చు. కానీ ఎచ్ఐవి (HIV) వంటివి పరీక్షలో కనుగొనలేని స్థితిలో అండిటెక్టబుల్గా ఉండటానికి మరియు వాటిని మీ లైంగిక శృంగార సహచరులకు (పార్ట్నర్కి/పార్ట్నర్లకు) ప్రసారం చేయకుండా నిరోధించడానికి దీర్ఘకాలిక చికిత్స అవసరం కావచ్చు. పూర్తి ఎస్టీఐ (STI) పరీక్ష కోసం మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతని (హెల్త్ కేర్ ప్రొవైడర్‌ని) ఎలా అడగాలో ఇక్కడ తెలుసుకోండి.
మీరు మీ ఫలితాలను అందుకుని చికిత్స పొందిన తరువాత, మీరు చివరిసారిగా పరీక్షించినప్పటి నుండి మీరు కలిగి ఉన్న లైంగిక శృంగార సహచరులకు (పార్ట్నర్కి/పార్ట్నర్లకు) ఖచ్చితంగా సురక్షితమైన లైంగిక సంభోగము (సెక్స్) గురించి వారితో మాట్లాడటం చర్చించడం కొనసాగించండి.
మీరు ఇక్కడ ఎస్టీఐ (STI) పరీక్ష చేయించుకున్నప్పుడు ఏమి ఆశించాలో దాని గురించి మరింత తెలుసుకోండి.