మీరు తరచు సెక్స్ చేస్తుంటే, మీ స్థితిని ఖచ్చితంగా తెలుసుకోవడానికి నిత్య కృత్యమైన (రెగ్యులర్) హెచ్ఐవి పరీక్ష మాత్రమే మార్గం. అయినప్పటికీ, క్లినిక్‌కు వెళ్లడం ఎల్లప్పుడూ సులభం కాదు, లేదా ఎచ్ఐవి పరీక్షా స్థలంలో మీ గోప్యత లేదా భద్రత గురించి మీరు ఆందోళన చెందవచ్చు.
కొన్ని ప్రదేశాలలో, మీరు మీ ఇంట్లో మీ స్వంతంగా పూర్తి చేసకోగల HIV పరీక్ష వస్తు సామగ్రిని (కిట్‌ను) పొందగలరు. స్వీయ-పరీక్షా వస్తు సామగ్రి (కిట్) మీరు క్లినిక్‌లో చేయించుకునే ఎచ్ఐవి పరీక్షల వలె ఖచ్చితమైనవి కావు, కానీ పరీక్షించకపోవడం కంటే స్వీయ పరీక్షే మేలు. ఏ కారణం చేతనైనా మీరు ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో (హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో) ఎచ్ఐవి పరీక్ష చేయలేకపోతే లేదా ఇష్టపడకపోతే, ఇది తదుపరి ప్రత్యామ్న్యాయం.
చాలా ఇంటి ఎచ్ఐవి పరీక్షలలో ఎచ్ఐవిని ఖచ్చితంగా గుర్తించడానికి 23 నుంచి 90 రోజుల మధ్య పడుతుంది. ఈ సమయంలో, HIV నెగటివ్‌గా పరీక్షించబడడం సాధ్యమే కాని వాస్తవానికి HIV- పాజిటివ్‌గా వ్యక్తి ఉండవచ్చు. మీ HIV స్థితిని నిర్ణయించడానికి ఈ విండో వ్యవధిలో మరియు దాని తరువాత పరీక్షించడం చాలా ముఖ్యం. మీ పరీక్ష ప్యాకేజీతో చేర్చబడిన వస్తువులు ఎచ్ఐవి ప్రతిరోధకాలను (యాంటీబోడీస్ని) గుర్తించగల కాలపరిమితిని మీకు తెలియజేస్తాయి. గత 72 గంటల్లో మీరు ఎచ్ఐవి బారిన పడ్డారని మీకు అనిపిస్తే, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ (పెప్) గురించి వెంటనే ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో (హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో) మాట్లాడండి.
ఇంట్లో ఎచ్ఐవి పరీక్షకు ప్రస్తుతం రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ఒక పరీక్ష వస్తు సామగ్రి (కిట్), ఇక్కడ మీరు మీ లాలాజల అనగా ఉమ్ము నమూనాను సేకరించి ఇంట్లో తక్షణ పరీక్ష ఫలితాలను చూడగలరు. రెండవ మార్గం ఇంట్లో రక్త నమూనాను తీసుకొని ప్రాసెసింగ్ కోసం ల్యాబ్‌కు పంపించడం. బిల్డింగ్ హెల్దీ ఆన్లైన్ కమ్యూనిటీస్ వారివద్ద ఈ పరీక్షల గురించి మరింత నిర్దిష్ట సమాచారం ఇక్కడ ఉంది.
మీ పరీక్ష ఫలితాలు మీరు ఎచ్ఐవి పాజిటివ్ అని చెబితే, మీ ఇంటి పరీక్ష ఫలితాలను నిర్ధారించడానికి మరింత స్పష్టమైన పరీక్షను అందించగల ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో (హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో) సంప్రదించండి. కొన్నిసార్లు, ఒక HIV పరీక్ష తప్పుడు పాజిటివ్ ఫలితాన్ని ఇవ్వగలదు, కాబట్టి ఆరోగ్య సంరక్షణ ప్రదాత (హెల్త్ కేర్ ప్రొవైడర్) మిమ్మల్ని మళ్లీ పరీక్షించడం ఎప్పటికైనా మంచిదే. వారు మీ పాజిటివ్ పరీక్ష ఫలితాన్ని ధృవీకరిస్తే, చికిత్సను ప్రారంభించడానికి మరియు ఇతర సహాయ సేవలకు మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత (హెల్త్ కేర్ ప్రొవైడర్) మీకు సహాయపడగలరు. మీకు నెగెటివ్ పరీక్ష ఫలితం వస్తే, మీ స్థితిని తెలుసుకోవడానికి రెగ్యులర్ ఎచ్ఐవి పరీక్షను తప్పక కొనసాగించండి. HIVని నివారించడంలో సహాయపడే రోజువారీ మాత్ర అయిన ప్రేప్ను (PrEPను) ప్రారంభించడం గురించి మీరు ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో (హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో) మాట్లాడుకోవచ్చు.
ప్రస్తుతం, ఇంట్లో పరీక్షించే వస్తుసామగ్రి (హోమ్ టెస్ట్ కిట్లు) ఐరోపాలో మరియు యు.ఎస్‌లో సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీ కోసం హెచ్ఐవి ఇంట్లో పరీక్షించే వస్తుసామగ్రి (హోమ్ టెస్ట్ కిట్) ఎంపికలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి. ఇంట్లో పరీక్షించే వస్తుసామగ్రిని (హోమ్ టెస్ట్ కిట్‌ను) ఉపయోగించడం మీకు సరైనది కాకపోతే, మీ సమీప ఎచ్ఐవి పరీక్షా స్థలాన్ని (సైట్‌ను) ఇక్కడ కనుగొనండి.