లైంగిక ప్రసార సుఖవ్యాధులను/ఇన్ఫెక్షన్లు, కొన్నిసార్లు ఎస్.టీ.డీలు (STDలు) లేదా ఎస్.టీ.ఐలు (STIలు) అని సంక్షిప్తీకరించబడతాయి, ఇవి లైంగిక సంపర్కం వల్ల కలిగే అంటువ్యాధులు. మీరు ఎలా సెక్స్ చేస్తున్నారు అనేదానిపై ఆధారపడి అనేక రకాల ఎస్టీఐలకు (STIలకు) మీరు గురి కాగలరు.
అన్ని ఎస్.టీ.ఐలు (STIలు) ఒకే విధంగా ప్రసారం చేయబడవు. గోనోరియా మరియు క్లామిడియా వంటి కొన్ని ఎస్.టీ.ఐలు (STIలు) శారీరక ద్రవాలైన వీర్యం, ఆసన, గుదము, పాయువు మరియు యోని ద్రవాల ద్వారా వ్యాపిస్తాయి. సిఫిలిస్ లేదా హెర్పెస్ వంటి ఇతర ఎస్.టీ.ఐలు (STIలు) చర్మానికి చర్మ స్పర్శ ద్వారా చేరుతాయి.
కొన్నిసార్లు మీరు లేదా మీ లైంగిక శృంగార సహచరులకు (సేక్షుఅల్ పార్ట్నర్కి/పార్ట్నర్లకు) ఎస్.టీ.ఐ (STI) ఉన్ననూ ఎటువంటి లక్షణాలు కనబడవు. వ్యక్తిని చూసినంత మాత్రాన, వారికి ఎస్.టీ.ఐ (STI) ఉందా లేదా అని మీరు చెప్పలేరు. మీరు చివరిసారిగా పరీక్షించబడిన విషయం గురించి మీ లైంగిక శృంగార సహచరులతో (సేక్షుఅల్ పార్ట్నర్లతో) మాట్లాడటం లేదా మీరు సంభోగించే (సెక్స్ చేసే) ముందు కలిసి వెళ్లి పరీక్షించుకోవడం మంచిది.
గుర్తుంచుకోండి: ఎస్.టీ.ఐ (STI) కలిగి ఉన్నంత మాత్రాన మీరు అజాగ్రత్త వహించే వ్యక్తి కారు. చాలా మందికి వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎస్.టీ.ఐ (STI) ఉంటుంది మరియు సంఖ్యాకత (మెజారిటీ) ఎస్.టీ.ఐలకు (STIలకు) చికిత్స చేయడం సులభం. తరచూ పరీక్షించడం ద్వారా మరియు ఎస్.టీ.ఐలను (STIలను) ఎలా నివారించాలో అర్థం చేసుకోవడం ద్వారా, మీరు మీ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
నిర్దిష్ట ఎస్.టీ.ఐల (STIల) గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ వనరులను చూడండి (ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషలలో లభిస్తుంది).