గర్భధారణను కండోమ్ వాడటం, మాత్ర తీసుకోవడం మరియు ఇతర దీర్ఘకాలిక నివారణ పద్ధతులతో సహా అనేక రకాలుగా నివారించవచ్చు. కొంతమంది ట్రాన్స్ వ్యక్తులకు గర్భం గురించి ఆలోచించడం వల్ల, మన శరీరాలు ఎల్లప్పుడూ మనకు సౌకర్యవంతంగా అనుకూలంగా ఉండవని గుర్తు చేస్తుంది. మీకు గర్భాన్ని ధరించే అవకాశాలుంటే గనక మీకు అందుబాటులో ఉన్న ఎంపికల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
గర్భధారణ పరీక్షను తీసుకోవడం, మీ లైంగిక శృంగార సహచరులతో (పార్ట్నర్లతో) గర్భం గురించి మాట్లాడటం లేదా జనన నియంత్రణను (బర్త్ కంట్రోల్) ప్రారంభించడం చాలా కారణాల వల్ల కష్టం. కానీ అలా చేయడం వల్ల మీ లైంగిక ఆరోగ్యాన్ని మీరు నియంత్రించుకోగలరు.
మీరు హార్మోన్లు తీసుకుంటుంటే, జనన నియంత్రణ కోసం టెస్టోస్టెరాన్ లేదా ఈస్ట్రోజెన్‌పై ఆధారపడటం ప్రభావవంతం కాదు. జనన నియంత్రణ మీ హార్మోన్ చికిత్సకు ఆటంకం కలిగిస్తుందని మీరు ఆందోళన చెందుతుంటే, హార్మోన్ రహిత ఎంపికలను కలిగి ఉన్న ప్రణాళికాబద్ధమైన పేరెంట్‌హుడ్ (ప్లాన్డ్ పేరెంట్ హుడ్) జాబితాను చూడండి. సందేహం కలిగినప్పుడు, మీ కోసం ఉత్తమంగా పనిచేసే ఎంపికకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో (హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో) మాట్లాడండి.
సురక్షితమైన లైంగిక శృంగార సంభోగము గురించి, ఇతర చిట్కాల కోసం, ట్రాన్స్ శరీరాల (బాడీల) కోసం సురక్షితమైన సెక్స్‌ని చూడండి. (ఆంగ్లంలో/ఇంగ్లిష్‌లో సమాచారానికి లింక్)