ఎస్.టీ.ఐలను (STIలను) నివారించడంలో మొదటి అడుగు ఎస్.టీ.ఐలు (STIలు) వివిధ మార్గాల్లో ప్రసారింపబడుతున్నాయని అర్థం చేసుకోవడం. మీరు దాని గురించి ఇక్కడ మరింత చదువుకోగలరు.
వీర్యం, యోని మరియు ఆసన (మలద్వార) ద్రవాలు (ఏనల్ ఫ్లూయిడ్స్) వంటి శరీర ద్రవాల గుండా వెళుతున్న ఎస్టిఐల ప్రసారాన్ని నివారించడానికి కండోమ్‌లు మరియు దంత ఆనకట్టలు (డెంటల్ డామ్స్) ప్రభావవంతమైన మార్గాలు. వీటిలో క్లామిడియా మరియు గోనేరియా ఉంటాయి. కాండోమ్లు మరియు దంత ఆనకట్టలను (డెంటల్ డామ్స్లను) ఉపయోగించడం వల్ల చర్మం నుండి చర్మానికి వెళ్ళే, రిమ్మింగ్ వల్ల మరియు మౌఖికంగా వెళ్ళే ఎస్.టీ.ఐలను (STIలను) కూడా నిరోధించవచ్చు.
మీరు కండోమ్‌లను ఉపయోగించకపోతే, లూబ్ను ఉపయోగించడం వల్ల మీ చర్మంలో చిన్న చీలికలు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. చర్మ చీలికలు, ఎస్.టీ.ఐల (STIల) అవకాశాలను పెంచుతాయి. మీరు ల్యూబ్ లేదా కండోమ్‌లను పొంద లేకపోతే, మీరు ఇక్కడ ప్రత్యామ్నాయాల గురించి మరింత తెలుసుకోవచ్చు. హెపటైటిస్ ఎ మరియు హెచ్పివి వంటి కొన్ని ఎస్టిఐలు (STIలు) మీరు వారితో సంబంధంలోకి రాకముందే టీకాతో నివారించవచ్చు. టీకా ఎలా మరియు ఎక్కడ పొందాలో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
మీరు ఎచ్ఐవి (HIV) నెగెటివ్‌గా ఉంటే, ఎచ్ఐవిని (HIVని) నివారించడానికి నమ్మశక్యం కాని కొత్త అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ప్రెప్ (PrEP) అనేది మీరు సెక్స్ చేసే ముందు ఎచ్ఐవి (HIV) సంక్రమణను నివారించట్టానికి మీరు తీసుకునే రోజువారీ మాత్ర. మీరు ఇప్పటికే ఎచ్ఐవి (HIV) సంక్రమణకు (ఎక్స్పోజర్కు) గురి అయ్యారని మీకు అనిపిస్తే, ఎచ్ఐవిని నివారించడానికి సంక్రమణ (ఎక్స్పోజర్) అయిన 72 గంటలలోపు మీరు పీఈపీని (PEPని) కూడా తీసుకోవచ్చు. PrEP మరియు PEP ఎచ్ఐవిని (HIVని) మాత్రమే నివారిస్తాయి, ఇతర ఎస్టీఐలను (STIలను) నివారించవు.
ఎప్పటిలాగే, మీరు ఎలా సెక్స్ చేసినా, ప్రతి 3 నుండి 6 నెలలకు ఒక STI పరీక్షను పొందడం మీ ఎస్టీఐ (STI) స్థితిని సమీక్షించటానికి సహాయపడుతుంది. ఇక్కడ కనుగొనండి, ఎక్కడ పరీక్షించాలో, ఆపై మీరు ఇష్టపడేదాన్ని చేయడానికి తిరిగి వెళ్లండి.