ఈ ప్రశ్న కు సమాధానం మీ సెక్స్ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా డాక్టరు మీకు హెచ్ఐవి కి, సిఫాలిస్ కి రక్త పరీక్ష, మీ జననాంగాల ఆరోగ్యం కోసం మూత్ర పరీక్ష రాస్తారు. మీరు ఓరల్ సెక్స్ (అంగ చూషణ) చేసే వారైతే, మీ నోట్లో ఏదైనా STDs ఉన్నాయని డాక్టర్ ను పరీక్ష చేయమనండి. అలాగే మీరు ఆనల్ సెక్స్ లో బోటమింగ్ చేసే (అంగాన్ని మీ మల రంధ్రం లోకి తీసుకొనే) వారైతే, మీ బట్ ను (మల రంధ్రాన్ని) పరీక్ష చేయమని చెప్పటం మంచింది
ఒక వేళ మీరు హెచ్ఐవి పాసిటివ్ వ్యక్తి అయితే, హెపిటాటిస్ బి, హెపిటాటిస్ సీ, పరీక్షలు కూడా చేయించుకోవటం ముఖ్యం.
మరింత సమాచారం కోసం, గ్రేటర్ దాన్ ఎయిడ్స్ అనే సంస్థ నుంచి వచ్చిన ఈ ఒక నిమిషం వీడియో ని చూడండి. (లింకు ఇంగ్లీష్ లో)