సమ్మతి అనేది మీరు మరియు ఇతర వ్యక్తుల మధ్య మీరు కలిసి స్వేచ్ఛతో ఏమి చేయాలనుకుంటున్నారో నిర్వచించే ఒప్పందం. క్రొత్త సహ ఉద్యోగిని కౌగిలించుకోవడం సరేనా కాదా అని మనము వారిని అడుగుతున్నామా లేదా నుంచి మనం గ్రైండర్లో కలుసుకున్న వారితో మన లైంగిక కోరికలు సౌకర్యాల గురించి చర్చించి, వారి అనుమతిని పొందుతున్నామా లేదా అనే విషయం దాకా, అంతే కాక మరెన్నో విషయాల గురించి ఇతరులతో చర్చించిన సందర్భాలలో వారి సమ్మతిని పొందుతున్నామా లేదా అనే వారకు, మన రోజువారి జీవితాలలో ఇతరుల సమ్మతిని పొందుటను పాటించవచ్చు.
లైంగిక సంబంధాల విషయానికి వస్తే, ప్రతి ఒక్కరి సమ్మతి పొందుటయే ప్రతి ఒక్కరూ, ఇతరులకు హాని కలిగించకుండా వారందరూ కావాలనుకున్నవి పొందేటట్లుగా ప్రతి ఒక్కరి సమ్మతి పొందుటను నిర్ధారించి నిశ్చయపరచగలరు. సమ్మతి అనేది స్పష్టమైన మరియు నిజాయితీపరమైన కమ్యూనికేషన్ అనగా చర్చ మరియు సంభాషణ గురించే. సమ్మతి అనేది రెండు విధాలుగా జరుగుతుంది: సమ్మతిని పొందడం మరియు అందించడం.
సమ్మతిని పొందడం అంటే, మీ లైంగింక శృంగార సహచరులనుంచి (పార్టనర్/పార్ట్నర్ల నుంచి) వారు సురక్షితంగా, భద్రంగా తమను తాము ఆనందిస్తున్నారని స్పష్టంగా, ఉత్సాహంగా ధృవీకరించడం నిశ్చయపరచడం. ప్రశ్నలు అడగడంతో (“నేను మీ చొక్కా తీయవచ్ఛా?”) మరియు సలహాలు ఇవ్వడం (“నేను మిమల్ని ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను, అది సరేనా?”) సహా అనేక విధాలుగా దీనిని పొందవచ్చు. మీ లైంగింక శృంగార సహచరులతో (పార్టనర్‌తో /పార్ట్నర్లతో) అడిగి తెలుసుకోవడం, వారి కోరికలను ఇష్టా అఇష్టాలను తెలుసుకొని వాటిని పాటించటం మరియు వారి సమ్మతిని పొందడం మీరు ఒకరి సరిహద్దులను ఒకరు పరస్పరంగా తెలుసుకున్నారని మరియు వాటిని గౌరవిస్తారని నిర్ధారిస్తుంది.
సమ్మతిని అందించడం అంటే మీరు ఆనందిస్తున్నారని మరియు జరుగుతున్న ప్రతి, చర్య మరియు క్రియతో సరేనని మీ ఆమోదము మీ లైంగిక శృంగార సహచరులకు (పార్టనర్‌కి/పార్ట్నర్లకు) తెలియజేయడం. మీరు “అవును”, "సరే" వంటి శబ్ద ధృవీకరణలతో పాటు ఆనందాన్ని సూచించే అశాబ్దిక స్వర సూచనలతో మీ సమ్మతిని అందించవచ్చు మరియు మీ పారవశ్యాన్ని మీ లైంగిక శృంగార సహచరులకు (పార్టనర్‌కి/పార్ట్నర్లకు) తెలియజేగలరు.
ఒక వ్యక్తి, వారి సమ్మతిని వారు ఏ సమయమందైననూ ఏ క్షణమైననూ వెనక్కని తీసుకోగలరని రద్దు చేయగలరని గుర్తించడం చాలా ముఖ్యం మరియు అత్యవసరం. మీరు ఎప్పుడైనా గ్రైండర్లో ఎవరితోనైనా ఏదైనా చెప్పినా, వారికి మీరు హామీ ఇచ్చినా వారితో మీరు వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం మీకు భిన్నంగా వేరేలా మరోలా అనిపించిందా? మీరు అనుకున్న, చెప్పిన, చేయాలనుకున్న లైంగిక మరియు ఇతర శృంగార క్రియలను తిరిగివేయాలని మార్చివేయాలనో చేయరాదనో రద్దుచేయాలనిపించిందా? మీరు ఎప్పుడైననూ చేయాలనుకుంటున్న దాని గురించి మీ మనస్సు మార్చుకోవచ్చు. అది మీ హక్కు. గ్రైండర్లో మీరు దేనికోసమైననూ సమ్మతి ఇచ్చినంత మాత్రాన, మీరు వారిని కలిసినప్పుడు మీరు అలాగే చేయాలన్న బాధ్యత ఏ మాత్రమూ మీ పైన లేదు. ప్రప్రధమంగా, మీరు మరియు మీ లైంగిక శృంగార సహచరులకు (పార్టనర్‌కి/పార్ట్నర్లకు) కలిసి చేస్తున్న క్రియలతో పనులతో మీరిరువురూ లేక మీరందరూ గౌరవవంతంగా మరియు సౌకర్యవంతంగా అనుభవం పొందే అర్హులు.
సమ్మతి గురించి మరింత తెలుసుకోవడానికి ప్లాన్డ్ (ప్రణాళికాబద్ధమైన) పేరెంట్‌హుడ్ వారి ఈ వీడియోను చూడండి. టీన్ వోగ్ నుండి వచ్చిన ఈ జాబితాలో సమ్మతి గురించి ఎలా సంభాషించాలో ఉదాహరణలు ఉన్నాయి. (ఆంగ్లంలో/ఇంగ్లిష్‌లో సమాచారానికి లింక్)