ట్రూవాడా, డెస్కోవి, టెన్విర్ ఇఎమ్ లేదా టిడిఎఫ్/ఎఫ్‌టిసి వంటి ఇతర జనరిక్ సాధారణ మందులు మొదట ఎచ్ఐవి-పాజిటివ్ ప్రజలలో వైరస్‌తో పోరాడటానికి అభివృద్ధి చేయబడ్డాయి. అయితే ఇప్పుడు మనకు తెలిసినదేమనగా, ఎచ్ఐవి-నెగటివ్ వ్యక్తులు కూడా వారికి గనక ఎచ్ఐవి ప్రసారించే సంక్రమించే అవకాశాలు లేక ప్రమాదమున్నచొ ఎచ్ఐవి ప్రసారాన్ని నివారించడానికి ఎచ్ఐవి నివారణ ఔషధాన్ని (ప్రేప్ను/PrEPను) ఉపయోగించవచ్చు. యూఎస్ ఆహారం మరియు ఔషధ పరిపాలనా విభాగం (యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ప్రస్తుతం ట్రూవాడా మరియు డెస్కోవీని ఎచ్ఐవి నివారణ ఔషధంగా (ప్రేప్ను/PrEPను) ఆమోదించింది. అలాగే, పెరు, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, కెన్యా, ఇజ్రాయెల్ మరియు కెనడాలో సమానార్థకమైన ప్రభుత్వ సంస్థలు కూడా యూఎస్ ఆహారం మరియు ఔషధ పరిపాలనా విభాగం (యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) వలె ప్రస్తుతం ట్రూవాడా మరియు డెస్కోవీని ఎచ్ఐవి నివారణ ఔషధంగా (ప్రెప్గా/PrEPగా) ఆమోదించినవి. ఇతర రూపాల్లో జెనెరిక్ ఎచ్ఐవి నివారణ ఔషధం (ప్రెప్/PrEP) కొన్ని దేశాలలో ఆమోదించబడింది.
తాయి.లండ్ మరియు బ్రాజిల్ వంటి ఇతర దేశాల్లో, క్లినికల్ ట్రయల్స్ ద్వారా కొంతమందికి ఎచ్ఐవి నివారణ ఔషధం / ప్రెప్ PrEP లభిస్తుంది. ఇంకా ఎన్నో చోట్లలో, కార్యకర్తలు ఎచ్ఐవి నివారణఔషధాన్ని (ప్రెప్ని/PrEPని) పొందాలని డిమాండ్ చేస్తున్నారు కాని వారి లక్ష్యాలు ఇంకా సాకారం కాలేదు.
ప్రతి దేశం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రెప్ వాచ్‌ని చూడండి.