ఎచ్ఐవి మహమ్మారికి విరుద్ధంగా పోరాటంలో క్రొత్త మరియు అత్యంత ప్రభావవంతమైన సాధనాల్లో ఒకటి ఎచ్ఐవి నివారణ ఔషధం (ప్రెప్/PrEP). ఇది స్థిరంగా తీసుకుంటే ఎచ్ఐవి ప్రసారాన్ని నివారించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేసే మందు. ఇతర లైంగిక సంక్రమణ వ్యాధులను ఎచ్ఐవి నివారణ ఔషధం (ప్రెప్/PrEP) నిరోధించదు.
ప్రస్తుతం భారతదేశంలో ఎచ్ఐవి నివారణకు ఆమోదించబడిన ఏకైక మాత్రను టెన్వీర్ ఈఎమ్ (TENVIR EM) లేదా టీడీఎఫ్/ఎఫ్టీసి (TDF/FTC) అంటారు, దీనిని ప్రతిరోజూ నోటి ద్వారా తీసుకుంటారు. ట్రువాడా (TRUVADA) మరియు డిస్కోవి (DISCOVY) అని పిలువబడే టెన్వీర్ ఈఎమ్ (TENVIR EM) మరియు టీడీఎఫ్/ఎఫ్టీసి (TDF/FTC) వంటి ఇతర మందులు ప్రస్తుతం కొన్ని దేశాలలో ఎచ్ఐవి నెగెటివ్ (HIV-) వ్యక్తులు ఎచ్ఐవి నివారణ ఔషధంగా (ప్రెప్/PrEPగా) ఉపయోగించడానికి మాత్రమే ఆమోదించబడ్డాయి, అయితే ఇవి త్వరలో మరెన్నో దేశాల్లో రాబోతున్నాయి.
గ్రేటర్ దాన్ ఎయిడ్స్ నుండి ఈ తొంభై సెకండ్ల వీడియోను మర్రిని వివరాల కోసం చూడండి. (ఆంగ్లంలో సమాచారానికి లింక్)