హెచ్ఐవి(HIV) అంటే హ్యూమన్ ఇమ్యునో డెఫషియన్సీ వైరస్ (Human Immunodeficiency Virus). హెచ్ఐవి వైరస్ మీ రోగ నిరోధక వ్యవస్థ ను బలహీన పరచి, మీ శరీరం ఆరోగ్యంగా ఉండటం కష్టం అయ్యేలా చేస్తుంది. హెచ్ఐవి వైరస్ తీవ్రం అయితే అది AIDS కు దారి తీస్తుంది.
అదృష్టవశాత్తూ, మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తొందరగా మందులు మొదలు పెట్టి, సక్రమంగా వాడితే హెచ్ఐవి వైరస్ ను నియంత్రణ లో ఉంచుకోవచ్చు. ఈ విషయం లో చాలా పురోగతి సాధించాం, ఇంకా సాధిస్తాం. ఇప్పుడు హెచ్ఐవి-పాజిటివ్ వ్యక్తులు సక్రమంగా మందులు వాడితే, హెచ్ఐవి-నెగటివ్ వ్యక్తులతో సమాన కాలం జీవించ వచ్చు.
మరింత సమాచారం కోసం, గ్రేటర్ దాన్ ఎయిడ్స్ అనే సంస్థ నుంచి వచ్చిన ఈ ఒక నిమిషం వీడియో ని చూడండి. (లింకు ఇంగ్లీష్ లో)