CDC వారి సిఫార్సు ప్రకారం ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములు కలిగిన గే/బై మగ వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. కాబట్టి, మీకున్న భాగస్వాముల సంఖ్య, మీరు చేసే లైంగిక క్రియను బట్టి, ప్రతి మూడు నెలల కొకసరైనా పరీక్ష చేయించుకోవటం మంచిది
సంపూర్ణంగా పరీక్ష చేసుకోవాలి అనుకొంటే, మీరు సెక్స్ లో ఉపయోగించే ప్రతి అవయవాన్ని పరీక్ష చేసుకోవటం మంచిది. మీరు అంగ చూషణ (ఓరల్ సెక్స్) చేసే వారైతే, మీ నోరుని, మల రంధ్ర క్రియ/చూషణ (అనల్ సెక్స్ లేదా రిమ్మింగ్) చేయించుకునే వారైతే మీ మల రంధ్రాన్ని పరీక్ష చేయించుకొని క్రిములు (ఇన్ఫెక్షన్స్) నుంచి శుభ్రం చేయించుకోవటం మంచిది. మీ అంగానికైతే మూత్ర పరీక్ష చేయించుకోవచ్చు.
మరింత సమాచారం కోసం గ్రేటర్ దాన్ ఎయిడ్స్ వారి, ఈ ఒక నిమిషం వీడియోని చూడండి. (సమాచారం ఇంగ్లీష్ లో)