ఒక హెచ్ఐవి పాసిటివ్ (HIV Positive) వ్యక్తి, వారి మందులు క్రమం తప్పకుండా వేసుకొంటూ ఉండడం వల్ల వారి శరీరం లో హెచ్ఐవి వైరస్ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. ఎంత తగ్గుతుందంటే, వారి రక్త పరీక్షలో కూడా వైరస్ కనిపించదు. అలాంటి వారి స్తితిని అన్ డిటెక్టబుల్ (Undetactable) అంటారు.
సైన్స్ నిర్ధారించిన ప్రకారం, ఒక హెచ్ఐవి ఉన్న అన్ డిటెక్టబుల్ అయిన వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉండడం మాత్రమే కాదు, వారి నుంచి హెచ్ఐవి వైరస్ వేరే వారికి వ్యాప్తి చెందడం జరగదు. అంటే అన్ డిటెక్టబుల్ = అన్ ట్రాన్స్మిటబుల్ (Undetectable = Untransmitable) (U=U). టెస్ట్ కి దొరక్కపోతే, అసలు వ్యాపించదు.
అన్ డిటెక్టబుల్ అయిన వ్యక్తి, వారికి రాయబడిన మందులు క్రమం తప్పకుండా వేసుకున్నంత కాలం అన్ డిటెక్టబుల్ గానే ఉంటారు.
అన్ డిటెక్టబుల్ అయితే హెచ్ఐవి నయం అయినట్లు(తగ్గినట్లు) కాదు. కానీ హెచ్ఐవి ప్రభావం తగ్గించటానికి, వేరే వారికి సోకకుండా ఉండడానికి ఇది ఒక చక్కని మార్గం.
హెచ్ఐవి ఉన్న అందరూ అన్ డిటెక్టబుల్ అవకపోవచ్చు. అన్ డిటెక్టబుల్ వైరల్ లోడ్ లేని వారు (అంటే ఎక్కువ వైరల్ లోడ్ ఉన్న వారు) కండోమ్స్, PrEP వంటి హెచ్ఐవి నివారణ పద్దతులు వాడుతూ సురక్షిత లైంగిక క్రియ (safe sex) లో పాల్గొన వచ్చు.
మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వెబ్ సైట్ చూడండి.
TheBody లేదా www.UequalsU.org. (లింకు ఇంగ్లీష్ లో)