ముద్దులు, పరస్పర హస్త ప్రయోగం, మరియు శరీర రాపిడి ద్వారా హెచ్ఐవి యొక్క ప్రమాదం ఉండదు. ఓరల్ సెక్స్ (నోటితో అంగ చూషణ), రిమ్మింగ్ (నాలుక తో మల రంధ్ర చూషణ), కండోమ్ పెట్టుకొని చేసే ఆనల్ సెక్స్ (సురక్షిత మల రంధ్ర లైంగిక క్రియ - టాప్ లేదా బాటమ్) ద్వారా హెచ్ఐవి సోకే ప్రమాదం తక్కువ. కండోమ్ లేకుండా ఆనల్ సెక్స్ లో టాప్ చేయటం(అంగాన్ని మల రంధ్రం లోకి పంపటం) వల్ల హెచ్ఐవి వచ్చే అవకాశం ఒక మోస్తరు గా ఉంటుంది. అదే కండోమ్ లేకుండా బాటమింగ్ చేయడం(అంగాన్ని మల రంధ్రం లోకి తీసుకోవటం) వల్ల హెచ్ఐవి రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది.
ఈ విషయాలన్నీ హెచ్ఐవి కి మాత్రమే వర్తిస్తాయి. సిఫలిస్, గొనోరియ, చమేదియా, హెపిటాటిస్ లాంటి సుఖ వ్యాధులకు కాదు.