ఎస్టీఐకి (STIకి) పాజిటివ్‌గా పరీక్షించబడటం ఒక భావోద్వేగమైన అనుభవం కావొచ్చు. ఈ సమయంలో మిమ్మల్ని మీరు శారీరకంగా మరియు మానసికంగా చూసుకోవడం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
మీకు మద్దతు సహాయము ఇచ్చే మీ విశ్వసనీయ వ్యక్తులతో మాట్లాడుకోవటం మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవటానికి ఒక మార్గం. మీ జీవితంలో విశ్వసనీయమైన వ్యక్తులను కనుగొనడం వల్ల మీరు మీ పరిస్థితిని వారితో చెప్పుకోగలరు. అలా మీ విశ్వసనీయులతో మీరు చెప్పుకోగలిగినప్పుడు, చికిత్స పొందుతున్నప్పుడు మీకు ఒంటరితనం అనిపించే అవకాశాలు తగ్గవచ్చు.
పాజిటివ్ పరీక్ష ఫలితం తరువాత మీరు మీ ఆరోగ్యాన్ని నియంత్రించి కాపాడగలిగినట్లే, మీ గత లైంగిక శృంగార సహచరులకు (పార్ట్నర్కి/పార్ట్నర్లకు) వారికి ఎస్టీఐలు (STIలు) సంక్రమించి ఉండవచ్చని చెప్పడం ద్వారా మీరు వారిని కూడా సమయంలో హెచ్చరించి జాగ్రత్త పరచ వచ్చు. మీ యొక్క గత లైంగిక శృంగార సహచరులకు (పార్ట్నర్కి/పార్ట్నర్లకు) మీ ఎస్టీఐ (STI) పరీక్ష పాజిటివ్ ఫలితం తెలియజేయడం ద్వారా, మీరు వారి పరీక్ష మరియు / లేదా చికిత్సను త్వరగా పొందటానికి వారిని సంసిద్ధులు చేస్తున్నారు.
మీ లైంగిక శృంగార సహచరులకు (పార్ట్నర్కి/పార్ట్నర్లకు) వారు ఎస్టీఐ (STI) పరీక్ష చేసుకోవాలని చెప్పటానికి పలు విధాలు కలవు. మీరు వారికి కాల్ చేసిగాని, మెసేజ్ చేసి గాని, గ్రైండర్ ద్వారా గాని లేక ముఖాముఖి కలసి గాని నేరుగా సూచించగలరు. కొన్ని సందర్భాల్లో, మీరు పాజిటివ్‌గా పరీక్షించబడినట్లుగా మీ లైంగిక శృంగార సహచరులకు (పార్ట్నర్కి/పార్ట్నర్లకు) చెప్పడం ఇబ్బందికరంగా లేదా సిగ్గుగా అనిపించవచ్చు మరియు అలా చేయడం కూడా అసురక్షితంగా అనిపించవచ్చు. అలా మీకనిపిస్తే, మీరు మీ స్థానిక ఆరోగ్య విభాగం (లోకల్ హెల్త్ డిపార్ట్మెంట్) ద్వారా లేదా టెల్ యువర్ పార్ట్నర్ డాట్ ఓఆర్జీ TellYourPartner.org (యూఎస్‌లో/USలో మాత్రమే) ద్వారా మీ లైంగిక శృంగార సహచరులకు (పార్ట్నర్కి/పార్ట్నర్లకు) నోటిఫికేషన్లు పంపించగలరు. అయితే, మీ లైంగిక శృంగార సహచరులకు (పార్ట్నర్కి/పార్ట్నర్లకు) తెలియజేయాలనే మీ నిర్ణయం మీ ఇష్టం.