ఈ ప్రశ్న కి సమాధానం కొంచం క్లిష్టమయినది. LGBT వ్యక్తుల కి వ్యతిరేకంగా చట్టాలు ఉన్న దేశాల్లో లేదా డాక్టరు - పేషంట్ కి మధ్య ఉన్న ఏకాంతత కి చట్టపరమైన రక్షణ లేని చోట్ల, వైద్య సహాయాన్ని అందించే సిబ్బందికి చెప్పటం సురక్షితం కాకపోవచ్చు.
కానీ, మనకు వైద్య సాయమందిచే సిబ్బందిని మనం నమ్మగల్గితే, వాళ్ళు కూడా మనకు మంచి కేర్ ఇవ్వగలరు. వాళ్లతో మన లైంగికత, లింగత్త్వం గురించి, మన సెక్స్ అలవాట్ల గురించి పంచుకోగల్గితే, వాళ్ళు మన లైంగిక ఆరోగ్యానికి కావాల్సిన సరైన టెస్టుల ని సిఫార్సు చేసే అవకాశం ఉంది.
ఒక డాక్టరు దగ్గర సేఫ్ గానే కాకుండా, అవమానం లేకుండా వైద్యం పొందే హక్కు మీకు ఉంటుందని గుర్తుంచుకోండి. ఏదైనా డాక్టర్ మీ లైంగికత, లింగత్వము ను లేదా మీ సెక్స్ అలవాట్లను తప్పని చెబితే, మందుల గురించి మాత్రమే మాట్లాడుదాం అని సున్నితంగా చెప్పండి.
మరింత సమాచారం కోసం, గ్రేటర్ దాన్ ఎయిడ్స్ అనే సంస్థ నుంచి వచ్చిన ఈ ఒక నిమిషం వీడియో ని చూడండి. (లింకు ఇంగ్లీష్ లో)